హైదరాబాద్, మహి న్యూస్ అక్టోబర్ 15: సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్యను సీనియర్ జర్నలిస్టులు నిమ్మరాజు చలపతిరావు, చలసాని నరేంద్ర, వాసిరెడ్డి నాగేంద్రప్రసాద్ బుధవారం పరామర్శించారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో ఈశ్వరయ్యకు శస్త్రచికిత్స జరిగింది. చికిత్స అనంతరం కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకుని పూర్తిస్థాయిలో కోలుకున్న ఆయన విజయవాడకు బయలుదేరే ముందు సీనియర్ జర్నలిస్టులు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈశ్వరయ్య భవిష్యత్తులో ప్రజా ఉద్యమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని నిమ్మరాజు చలపతిరావు ఆకాంక్షించారు.
News that matters, as it happens
Saturday, 31 October 2026
www.mahinewsindia.com
సీపీఐ నేత గుజ్జల ఈశ్వరయ్యకు సీనియర్ జర్నలిస్టుల పరామర్శ
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/150
Be the first to share your thoughts on this story!