శ్రీశైలం, మహి న్యూస్, ఆగస్టు 23: లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజుల్లో ఈ ఉత్సవాన్ని దేవస్థాన సేవగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఉత్సవంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. అనంతరం కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని మహాగణపతి పూజ నిర్వహిస్తారు. తదుపరి శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేపు చేయించి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహిస్తారు. భక్తులు ఈ పల్లకీ ఉత్సవంలో పాల్గొని స్వామిఅమ్మవార్ల ఆశీస్సులు పొందాలని దేవస్థానం అధికారులు తెలిపారు.
News that matters, as it happens
Sunday, 13 September 2026
www.mahinewsindia.com
శ్రీశైలంలో వైభవంగా పల్లకీ ఉత్సవం - లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక సేవలు
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/74
0 Comments