గిరిజన అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం: జెడ్పీటీసీ అభ్యర్థి పాచిపెంట శాంతకుమారి
కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తాం
అల్లూరి సీతారామరాజు జిల్లా | అరకువెల్లి | మహి న్యూస్ అక్టోబర్ 31:
అరకువెల్లి మండలంలోని లోతేరు సంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు శనివారం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. జెడ్పీటీసీ అభ్యర్థి పాచిపెంట శాంతకుమారి, లోతేరు సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి పాంగి గంగాధర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, ఆదివాసీల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులతో పాటు వైసీపీ నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు.
అక్కాచెల్లెమ్మలకు ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి, మాదల డేవిడ్, అప్పలనాయుడు, రాజేష్, రామకృష్ణ తదితరులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
Be the first to share your thoughts on this story!