మహి న్యూస్, కొత్తవలస, విజయనగరం జిల్లా
మహాకవి గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకుని కొత్తవలస మండలం దెందేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి.ఎం.జి. పరమేశ్వరరావు (శివ) తన కళా నైపుణ్యాన్ని చాటుతూ సాధారణ సబ్బు బిళ్లపై గురజాడ అప్పారావు చిత్రాన్ని సూక్ష్మంగా చెక్కారు.
చిన్న సబ్బు బిళ్లపై గురజాడ ముఖచిత్రాన్ని ఎంతో సున్నితంగా, అద్భుతమైన నైపుణ్యంతో చెక్కడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతి చిన్న ప్రదేశంలోనూ భావవ్యక్తీకరణకు ఏమాత్రం లోటు లేకుండా గురజాడ రూపాన్ని తీర్చిదిద్దిన తీరు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గురజాడ జయంతి సందర్భంగా ఆయన సాహిత్య సేవలను స్మరించుకుంటూ కుంచెతో కాదు.. సూక్ష్మ చెక్కుడుతో నివాళి అర్పించిన పరమేశ్వరరావు (శివ) ప్రతిభను పలువురు అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు కళలపై ఆసక్తిని కలిగించేలా ఇటువంటి వినూత్న ప్రయత్నాలు ఎంతో ప్రేరణనిస్తాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
News that matters, as it happens
Sunday, 01 November 2026
www.mahinewsindia.com
సబ్బు బిళ్లపై గురజాడకు కళా నివాళి చూపరులను ఆకట్టుకుంటున్న సూక్ష్మ కళాకృతి
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/106
Be the first to share your thoughts on this story!