News that matters, as it happens
Sunday, 01 November 2026
www.mahinewsindia.com
'ప్యారడైస్' మూవీ మోహన్ బాబు సంచలన వాఖ్యలు
"దర్శకుడు శ్రీకాంత్ నన్ను ఇంత హింసాత్మకంగా చూపిస్తాడని ముందే తెలిస్తే ఈ సినిమా చేసేవాడిని కాదు" అంటూ మోహన్ బాబు చమత్కరించారు. అయితే, ఒకసారి అంగీకరించిన తర్వాత కథానాయకుడిని, నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. తన గురువు దాసరి నారాయణరావు తర్వాత మళ్లీ శ్రీకాంత్ ఓదెల మాత్రమే కొన్ని సన్నివేశాల కోసం తనతో 10 టేకుల వరకు చేయించారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సెట్‌లో తనను "మోహన్ బాబు" అనే ఇమేజ్‌తో కాకుండా కేవలం పాత్రగా మాత్రమే చూశారని, శ్రీకాంత్ సాధారణ దర్శకుడు కాదని, అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉందని కొనియాడారు.
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/113