యానం, మహి న్యూస్, సెప్టెంబర్ 26:
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుదుచ్చేరి డీఐజీ ఆదేశాల మేరకు యానంలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా స్వచ్ఛభారత్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
యానాం ఫెర్రీ రోడ్డులో ఎస్పీ వరదరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐలు కుమార్, పట్టాభి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!