Sunday, 01 November 2026 News that matters, as it happens
Header-2
BREAKING

కనకాలపేటలో ఘనంగా గణపతి లడ్డూల వేలం. 8 లడ్డూల ద్వారా రూ.1,24,616 ఆదాయం.

ప్రచురణకర్త / Publisher: Mahi News Editorial Desk
📍 యానం
📅 ప్రచురణ: 27 Sep 2026, 08:42 AM
🔄 నవీకరణ: 10 Oct 2026, 07:56 AM
👁️ 11 views
Share this Article:

యానం, మహి న్యూస్, సెప్టెంబర్ 26:

యానాం శివారు కనకాలపేట రామాలయం సెంటర్‌లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 18వ గణపతి నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూలను శనివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా వేలం నిర్వహించారు. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని లడ్డూలను వేలంలో సొంతం చేసుకున్నారు.
వేలంలో 108 కిలోల మహా లడ్డూను ముద్దింశెట్టి ఏసుబాబు, కోన సత్తయ్య రూ.72,000కు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా కోలా వెంకటేష్ రూ.10,500, కోన నరసింహారామయ్య రూ.7,500, కనకాల రాజు రూ.7,116, ఫ్రెండ్స్ బ్యాచ్ రూ.8,000, హంసాని రామ లక్ష్మణ్ రూ.9,000, కోన వెంకటరమణ రూ.6,000, కోన నాని రూ.4,500 చొప్పున లడ్డూలను సొంతం చేసుకున్నారు.
మొత్తం 8 లడ్డూల వేలం ద్వారా రూ.1,24,616 ఆదాయం సమకూరింది. వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. లడ్డూలను సొంతం చేసుకున్న భక్తులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి, అనంతరం ఊరేగింపుగా లడ్డూలతో వారి ఇళ్లకు తీసుకెళ్లారు.
ఘనంగా గణపతి శోభాయాత్ర
లడ్డూల వేలం అనంతరం గణపతి స్వామివారి శోభాయాత్రను ఘనంగా ప్రారంభించారు. తీన్మార్, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/118

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X