చిత్తూరు జిల్లా/ బంగారుపాళ్యం సెప్టెంబర్ 28.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో, అలాగే చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు ముద్దాయిలను బంగారుపాళ్యం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు దొంగిలించబడిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల మొత్తం విలువ సుమారు రూ.3,50,000/-.
బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ Cr.No.160/2026 U/sec.303(2) BNS కేసులో, బంగారుపాళ్యం మండలం కాటప్పగారిపల్లి సమీపంలోని శ్రీ వారి హోటల్ వద్ద పార్క్ చేసిన సుజుకి ఆక్సిస్ (AP-03-CX-0050) ద్విచక్ర వాహనం దొంగతనానికి గురైనట్లు కే . శివకుమార్, తండ్రి కె. సీనయ్య, నలగంపల్లి గ్రామం, బంగారుపాళ్యం మండలం అను అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా, జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, పలమనేరు ఎస్డిపిఓ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో, 28-09-2026 తేదీన బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు, సబ్- ఇన్స్పెక్టర్ టి. ప్రసాద్ మరియు సిబ్బంది చిత్తూరు–పలమనేరు ఎన్ హెచ్ -69 హైవే రోడ్డుపై తంబుగానిపల్లి క్రాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను గమనించి వెనక్కి తిరిగి పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, వారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన విగ్నేష్ కుమార్ సెల్వం @ విగ్నేష్, బి.చంద్రు బీమన్, జి.విజయ్ గా గుర్తించారు. విచారణలో ఆర్థిక అవసరాలు మరియు చెడు అలవాట్ల కారణంగా తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. వారి వాంగ్మూలం మరియు వారు చూపించిన ప్రదేశం ఆధారంగా కాటప్పగారిపల్లి క్రాస్ సమీపంలోని మూసివేయబడిన మహా జ్యూస్ ఫ్యాక్టరీ ప్రాంగణంలోని షెడ్‌లో దాచిపెట్టిన నాలుగు దొంగిలించబడిన ద్విచక్ర వాహనాలను బంగారుపాళ్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన ముద్దాయిల వివరాలు:
1. విగ్నేష్ కుమార్ సెల్వం @ విగ్నేష్, వయస్సు 20 సంవత్సరాలు, తండ్రి: సెల్వం, నివాసం: నెం.197, ఓల్డ్ కాలనీ, వడపుదుపట్టు గ్రామం, అంబూర్ తాలూకా, వేలూరు జిల్లా, తమిళనాడు. (సదరు ముద్దాయి పైన తమిళనాడు రాష్ట్రంలోని ఆంబూరు, వేలూరు నార్త్, కాట్పాడి పోలీసు స్టేషన్ల పరిదిలో సుమారు 13 దొంగతనం కేసులు ఉన్నవి).
2. బి. చంద్రు భీమన్, వయస్సు 24 సంవత్సరాలు, తండ్రి: భీమన్, నివాసం: మెయిన్ రోడ్, పుదూర్, మెల్వాయితినంకుప్పం (ఎం.వి. కుప్పం), మెల్పట్టి పోస్ట్, పెర్నాంబట్టు తాలూకా, వేలూరు జిల్లా, తమిళనాడు.( సదరు ముద్దాయి పైన తమిళనాడు రాష్ట్రంలోని పలు పోలీసు స్టేషన్ల 2 దొంగతనం కేసులు ఉన్నవి).
3. జి. విజయ్, వయస్సు 26 సంవత్సరాలు, తండ్రి: జ్ఞానప్రకాశం, డోర్ నెం.1/157, కనారు స్ట్రీట్, సమరీశికుప్పం గ్రామం (ఎస్.ఆర్. కుప్పం), ఎం.వి. కుప్పం పోస్ట్, పెర్నాంబట్టు తాలూకా, వేలూరు జిల్లా, తమిళనాడు.
రికవరీ చేసిన దొంగిలించబడిన ద్విచక్ర వాహనాలు:
1. సుజుకి ఆక్సిస్ AP-03-CX-0050, విలువ సుమారు రూ.80,000/- బంగారుపాళ్యం PS Cr.No.160/2026.
2. టీవీఎస్ జూపిటర్ – TN-23-DJ-4505, విలువ సుమారు రూ.1,30,000/- బంగారుపాళ్యం PS Cr.No.158/2026
3. సుజుకి ఆక్సిస్ – AP-40-CE-2237 విలువ సుమారు రూ.50,000/- చిత్తూరు తాలూకా PS Cr.No.44/2026
4. సుజుకి ఆక్సిస్ – AP-40-EE-0028, విలువ సుమారు రూ.90,000/- చిత్తూరు II టౌన్ PS Cr.No.106/2026
రికవరీ చేసిన నాలుగు ద్విచక్ర వాహనాల మొత్తం విలువ సుమారు రూ.3,50,000/-.
అదేవిధంగా, నేరాలకు ఉపయోగించిన బజాజ్ పల్సర్ NS200, Reg.No.TN-18-BA-8212 ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన ముగ్గురు ముద్దాయిలను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా ద్వారా మరిన్ని ద్విచక్ర వాహనాల దొంగతనాలు జరిగాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామని బంగారుపాళ్యం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు తెలిపారు.పై తెలిపిన కేసులో ముద్దాయిలను త్వరితగతిన అరెస్ట్ చేసిన బంగారుపాళ్యం పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి అభినందించారు.
Be the first to share your thoughts on this story!