News that matters, as it happens
Sunday, 01 November 2026
www.mahinewsindia.com
అనధికార గైర్హాజరైన ప్రభుత్వ వైద్యులపై చర్యలు.
70 మంది ప్రభుత్వ వైద్యులను తొలగించినట్లు వెల్లడి.
Story Highlights
ఆంధ్రప్రదేశ్ లో పెనుసంచలనంగా మారిన నిర్ణయం. పరిపాలన వైఫల్యాలను ఉపేక్షించని సియం చంద్రబాబు.
అమరావతి, అక్టోబర్ 2, మహి న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న ప్రభుత్వ వైద్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న 70 మంది ప్రభుత్వ వైద్యులను తొలగించినట్లు తాజా సమాచారం వెల్లడించింది. మరో 193 మంది వైద్యులపై క్రమశిక్షణా చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత లేకుండా సేవలను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉన్నత అధికారుల అనుమతి లేకుండా దీర్ఘకాలం విధులకు గైర్హాజరు కావడంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే పలు దశల్లో అనధికార గైర్హాజరైన వైద్యులపై తొలగింపు చర్యలు చేపట్టింది. సెప్టెంబర్‌లో జరిగిన సమీక్షలో 493 మంది వైద్యులు అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నట్లు గుర్తించారు.వారిపై నిబంధనల ప్రకారం చర్యలు పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్య సేవలకు ఆటంకం కలగకుండా క్రమశిక్షణను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. వైద్యుల హాజరు, విధుల నిర్వహణపై ఇకపై మరింత కఠిన పర్యవేక్షణ ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు.
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/130
Be the first to share your thoughts on this story!