Saturday, 31 October 2026 News that matters, as it happens
Header-2
BREAKING

వెంకటగిరికి గర్వకారణం. పెనుబాకు పుల్లయ్యకు ఘన సన్మానం.

ప్రచురణకర్త / Publisher: KADAPA
📍 వెంకటగిరి
📅 ప్రచురణ: 02 Oct 2026, 09:41 PM
🔄 నవీకరణ: 27 Oct 2026, 10:45 AM
👁️ 93 views
Share this Article:
వెంకటగిరి, అక్టోబర్ 2, మహి న్యూస్: వెంకటగిరి మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా సేవలందిస్తున్న పెనుబాకు పుల్లయ్యకు తిరుపతిలో శుక్రవారం ఘన సన్మానం జరిగింది. ఉత్తమ సేవలు అందించినందుకు ఆయనకు “ఉత్తమ సేవా గ్రహీత” సన్మానం లభించింది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా పుల్లయ్యను ఘనంగా సత్కరించారు. పుల్లయ్య తన విధులను అంకితభావంతో నిర్వహిస్తూ ప్రజలకు విశేష సేవలందిస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతి కుమార్ కొనియాడారు. పుల్లయ్య తనకు ప్రియ శిష్యుడని, ఆయనకు లభించిన ఈ గౌరవం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. తిరుపతి జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా సన్మానం పొందడం వెంకటగిరి పట్టణానికే గర్వకారణమని పేర్కొన్నారు. పుల్లయ్య సేవలను ఆదర్శంగా తీసుకుని మరింత మంది పారిశుధ్య కార్మికులు అంకితభావంతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/132

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X