దొరవారిసత్రం, అక్టోబర్ 3, మహి న్యూస్: తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలంలో గత మూడు సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేటి వికసిత్ భారత్ గా పిలుస్తున్న వి బి జి రాం జి నిధుల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ పనుల పేర్లను సృష్టించి కొందరు అవినీతి సిబ్బంది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని కాజేసినట్లు విశ్వసనీయ సమాచారం. క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేయకుండానే, మెటీరియల్ బిల్లులతో పాటు కొద్దిపాటి పనులకు కూడా ఐదు నుండి ఏడు రెట్లు అదనంగా ప్రభుత్వం నుండి నగదు మంజూరు అయ్యేలా పథకం ప్రకారం ఈ నిధుల దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
లూటీ వెనుక పెద్దలు, ఉన్నతాధికారుల హస్తం?
ఈ భారీ కుంభకోణం వెనుక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ సిబ్బందితో పాటు, కొందరు పంచాయతీ అభివృద్ధి అధికారులు కీలక పాత్ర పోషించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకుల జోక్యం, ఉన్నత అధికారుల అండదండలు మెండుగా ఉండటం వల్లే ఎలాంటి భయం లేకుండా ఈ దోపిడీ సాగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రికార్డులు సృష్టించి, ఒకే పనికి పదే పదే బిల్లులు డ్రా చేసుకున్నట్లు మండల వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఇళ్ల స్థలాల నిధుల్లోనూ చేతివాటం.
ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో నిరుపేదల ఇళ్ల స్థలాల లేఅవుట్ల అభివృద్ధి కోసం కేటాయించిన ప్రభుత్వ నిధులపై పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్థలాల చదును, మౌలిక వసతుల కల్పన పేరిట వికసిత్ భారత్ దొరవారిసత్రం మండల కార్యాలయం నుండి విడుదలైన నిధులను క్షేత్రస్థాయిలో సద్వినియోగం చేయకుండా, కాగితాల్లోనే పనులు చూపించి స్వాహా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిష్పక్షపాత విచారణకు డిమాండ్.
అధికార ముసుగులో సాగిన ఈ ‘ఉపాధి’ దోపిడీపై ఆడిట్ మరియు విజిలెన్సు అధికారులు స్పందించి పూర్తిస్థాయి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని మండల ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అవినీతి తిమింగలాల ఆట కట్టించి, ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయాలని, బాధ్యులైన సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News that matters, as it happens
Sunday, 01 November 2026
www.mahinewsindia.com
దొరవారిసత్రం మండలంలో ‘ఉపాధి’ నిధుల లూటీ. నకిలీ పనుల పేరిట కోట్ల రూపాయల దోపిడీ.
⭐ Key Highlights / ముఖ్యాంశాలు
కొద్దిపాటి పనులకే ఐదు నుండి ఏడు రెట్లు బిల్లుల మంజూరు.
అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల జోక్యంతోనే అక్రమాలు.
నిరుపేదల ఇళ్ల స్థలాల నిధులపై నిష్పక్షపాత విచారణకు ప్రజల డిమాండ్.
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/134
Be the first to share your thoughts on this story!