Sunday, 01 November 2026 News that matters, as it happens
Header-2
BREAKING

అధికార ముసుగులో అడ్డగోలు దోపిడీ:సూళ్లూరుపేటలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు!

ప్రచురణకర్త / Publisher: KADAPA
📍 సూళ్లూరుపేట
📅 ప్రచురణ: 03 Oct 2026, 10:16 AM
🔄 నవీకరణ: 12 Oct 2026, 08:40 PM
👁️ 38 views
Share this Article:

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

వాటాల మత్తులో మునిగితేలుతున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు. కాలువలను సైతం మింగేస్తున్నా కరవైన కనీస పట్టింపు. కడుతున్నప్పుడు 'మామూళ్ల' మౌనం, కట్టిన తర్వాత కేసుల నాటకం! అవినీతి తిమింగలాల మాయాజాలంపై 'అడిగేవారే లేరా?'
సూళ్లూరుపేట, అక్టోబర్ 3, మహి న్యూస్: తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట పట్టణంలో అక్రమ కట్టడాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి, ప్రభుత్వ భూములను, కాలువలను సైతం కబ్జా చేస్తూ వెలుస్తున్న భవనాల వెనుక రెవెన్యూ, మున్సిపల్ అధికారుల "వాటాల" మత్తు స్పష్టంగా కనిపిస్తోంది. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే చట్టాలు, నిబంధనలు గుర్తుచేసే అధికారులు, కోట్ల రూపాయల విలువైన అక్రమ కట్టడాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపుల పర్వం నడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కాలువలను సైతం మింగేస్తున్న కరడుగట్టిన కబ్జాలు!

పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లో సైతం కనీస అనుమతులు లేని నిర్మాణాలు నేటికీ యథేచ్ఛగా సాగుతున్నాయి. వర్షపు నీరు వెళ్లే కాలువలను, డ్రైనేజీ మార్గాలను సైతం ఆక్రమించి స్లాబులు వేస్తుంటే, అధికార యంత్రాంగం కంటిచూపుతోనే కాలం వెళ్లదీస్తోంది. ఈ కాలువల ఆక్రమణల వల్ల స్వల్ప వర్షానికే పట్టణం జలమయం అయ్యే ప్రమాదం పొంచి ఉన్నా, అధికారులకు మాత్రం పట్టింపు లేకుండా పోయింది.

వాటాల మత్తులో మున్సిపాలిటీ, రెవెన్యూ మాయలు!

అక్రమ నిర్మాణదారుల నుంచి భారీగా ముడుపులు అందుతుండడమే అధికారుల ఉదాసీనతకు అసలు కారణం. ప్లాన్ ఒకలా ఉంటే, క్షేత్రస్థాయిలో కట్టడం మరోలా ఉంటోంది. నిబంధనల ఉల్లంఘనలను గుర్తించాల్సిన ప్లానింగ్ అధికారులు 'మామూళ్ల' మత్తులో జోగుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువు పోరంబోకు స్థలాల పరిరక్షణను గాలికొదిలేసి, ప్రైవేటు వ్యక్తుల అడ్డగోలు సంపాదనకు రెవెన్యూ విభాగం పరోక్షంగా పూర్తి సహకారం అందిస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

కడుతున్నప్పుడు మౌనం, కట్టిన తర్వాత కేసులు!

సూళ్ళూరుపేట పట్టణంలో రెవెన్యు, మున్సిపాలిటీ అధికారుల తీరు అత్యంత విచిత్రంగా, హాస్యాస్పదంగా సాగుతోంది. ఒక అక్రమ కట్టడం పునాది పడుతున్నప్పటి నుంచి స్లాబ్ వేసే వరకు అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. అంతా సజావుగా సాగుతున్నట్లు మౌనం పాటిస్తారు. భవనం పూర్తయ్యాక సడన్‌గా నిద్ర లేచి, నోటీసులు ఇవ్వడం లేదా కేసులు పెట్టడం వంటి నాటకాలకు తెరలేపుతారు. ఇది కేవలం కోర్టుల నుంచి స్టే తెచ్చుకోవడానికి సదరు యజమానులకు సమయం ఇవ్వడానికేనని, ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారమే జరుగుతోందని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

అడిగేవారు లేరా?.. సామాన్యుల ఆగ్రహం!

అధికార ముసుగులో కొందరు రియల్టర్లు, స్థానిక నేతలు, అధికారులు చేతులు కలిపి పట్టణాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. సామాన్యుడిపై ప్రతాపం చూపే యంత్రాంగం, ఈ అవినీతి తిమింగలాల ముందు ఎందుకు మోకరిల్లుతుందో పట్టణ ప్రజలకు అర్థం కావడం లేదు. "ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసే నాథుడే లేడా?" అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా స్పందించి, సూళ్లూరుపేటలో జరుగుతున్న ఈ అక్రమ కట్టడాల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/135

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X