వెంకటగిరి, అక్టోబర్ 3, మహి న్యూస్: బహుళ అష్టమి, ఆరుద్ర నక్షత్రం, మహాలయ పక్షాల శుభ సందర్భంగా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.జె. ప్రకృతి కుమార్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరగడంలో ఎంతో కీలకమైన, చరిత్రాత్మకమైన పాత్ర వహించిన వెంకటగిరి పారిశుధ్య కార్మికుల సేవలను ఆయన కొనియాడారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు హైజెనిక్ ఫ్లాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రథమంగా పోలేరమ్మ శక్తిపీఠంలోని పూజారులకు ప్రకృతి కుమార్ ఫ్లాస్కులను బహుకరించి, పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పారిశుధ్య కార్మికులకు వాటిని అందజేశారు. జాతర మహోత్సవంలో రాత్రింబవళ్లు శ్రమించి ఊరిని పరిశుభ్రంగా ఉంచిన కార్మికుల సేవలు అమోఘమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యులు చినమదిరి గోపీనాథ్, వనం చెంచుబాబు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News that matters, as it happens
Sunday, 01 November 2026
www.mahinewsindia.com
వెంకటగిరి పారిశుధ్య కార్మికులకు హైజెనిక్ ఫ్లాస్కులు పంపిణీ చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.జె. ప్రకృతి కుమార్.
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/137
Be the first to share your thoughts on this story!