ఓజిలి, అక్టోబర్ 6, మహి న్యూస్:
ఇరిగేషన్ శాఖకు తెలియకుండా జరిగిందా? లేక అన్నీ తెలిసే జరిగాయా?
ప్రజల సొమ్ము అంటే ఇష్టానుసారంగా ఖర్చు పెడతారా? పూర్తి విచారణకు డిమాండ్.
తిరుపతి జిల్లా ఓజిలి మండలం సగుటూరు పంచాయతీలోని చెరువు పనుల వ్యవహారం నేటికీ తీవ్ర చర్చనీయాంశంగానే ఉంది. చెరువు కట్టపై ఉన్న చెట్ల తొలగింపు, జంగిల్ క్లియరెన్స్, కట్ట బలోపేత పనులు, అంచనా వ్యయాల పెంపు, టెండర్ ప్రక్రియలపై వరుస ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం, సుమారు రూ.40 లక్షల పరిధిలో పూర్తయ్యే పనులకు అనేక రెట్లు అధికంగా నిధుల ప్రతిపాదనలు పంపించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రతిపాదనలు ఎవరు తయారు చేశారు ఏ సాంకేతిక ఆధారాలపై రూపొందించారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అంటున్నారు.
వేలం ముందు చెట్లు తొలగించిన వారు ఎవరు?
చెరువు కట్టపై ఉన్న విలువైన చెట్లకు అధికారిక వేలం ప్రక్రియ పూర్తికాకముందే వాటిని తొలగించారనే దానిపై, ప్రభుత్వ ఆస్తిగా ఉన్న చెట్ల తొలగింపుకు ఎవరు అనుమతి ఇచ్చారు, వాటి విలువ ఎంత, ప్రభుత్వ ఖజానాకు ఎంత ఆదాయం రావాల్సి ఉంది అనే ప్రశ్నలుపై ఇర్రిగేషన్ మరియు పంచాయితీ అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు.
జంగిల్ క్లియరెన్స్ ఎందుకు? ఎవరి కోసం?
చెట్ల తొలగింపు వివాదం ఇంకా పరిష్కారం కాకముందే కట్టపై జంగిల్ క్లియరెన్స్ పనులు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ ఇది కట్ట బలోపేత పనుల్లో భాగమైతే, సంబంధిత అంచనాలు, వర్క్ ఆర్డర్లు, మెజర్‌మెంట్ బుక్స్ ఏమి చెబుతున్నాయి? ఒకవేళ భాగం కాకపోతే, ఆ పనులు ఎవరి ఆదేశాలతో జరిగాయి అనేది తెలియాల్సి ఉంది.
ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు?
చెరువు పనులు జరుగుతున్న సమయంలో ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ ఎక్కడ ఉంది, పనులపై ఫీల్డ్ తనిఖీలు జరిగాయా, జరిగినట్లయితే అధికారులు ఏమి గుర్తించారు, జరగనట్లయితే ఎందుకు జరగలేదు అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులు అంటే ప్రజల కష్టార్జిత పన్నుల రూపంలో వచ్చిన ధనం. ప్రతి రూపాయి ఖర్చుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అసలు అవసరానికి మించి అంచనాలు రూపొందించారా, టెండర్ల ద్వారా వ్యయాలు పెంచారా, లేక అన్ని ప్రక్రియలు నిబంధనల ప్రకారమే జరిగాయా అనే అంశాలు అధికారిక విచారణ ద్వారానే తేలాల్సి ఉంది.
విజిలెన్స్ విచారణ జరిపితేనే నిజాలు బయటపడతాయా?
సగుటూరు చెరువు వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న ప్రశ్నలు కేవలం ఒక గ్రామానికి పరిమితం కావడం లేదు. ప్రజా ఆస్తులు, ప్రభుత్వ నిధులు, పరిపాలనా పారదర్శకతకు సంబంధించిన అంశాలు కావడంతో స్వతంత్ర విచారణ అవసరమని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
News that matters, as it happens
Saturday, 31 October 2026
www.mahinewsindia.com
సగుటూరు చెరువులో కోట్ల క్రీడ? రూ.40 లక్షల పనికి రూ.1.20 కోట్ల ప్రతిపాదనా? ప్రజాధనంపై ప్రశ్నల వర్షం! వేలం పూర్తికాకముందే చెట్లు మాయం. వెంటనే జంగిల్ క్లియరెన్స్. దీనికి సూత్రదారులు, పాత్రదారులు ఎవరు?
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/141
Be the first to share your thoughts on this story!