శ్రీశైలం, మహి న్యూస్, ఆగస్టు 23: శ్రీశైల దేవస్థానంలోని భ్రమరాంబిక అమ్మవారికి లక్కతో కూడిన బంగారు గోపుర కలశాన్ని కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా దేవదుర్గకు చెందిన గురుబసప్ప, వారి కుటుంబసభ్యులు ఆదివారం సమర్పించారు. ఈ సందర్భంగా 47 గ్రాముల బరువున్న లక్కతో కూడిన బంగారు గోపుర కలశాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు దేవస్థానానికి అందజేశారు. ఆలయ పర్యవేక్షకులు హరికృష్ణారెడ్డి, ఆలయ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బరాయుడు, గుమాస్తా సావిత్రి కలశాన్ని స్వీకరించారు. అనంతరం దాతలకు దేవస్థానం తరఫున రశీదు అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనంతో పాటు శ్రీశైలం స్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమాన్ని శ్రీశైల దేవస్థానం అధికారులు నిర్వహించారు.
News that matters, as it happens
Sunday, 13 September 2026
www.mahinewsindia.com
అమ్మవారికి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పణ
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/73