వికారాబాద్ జిల్లా పరిగి (మహి న్యూస్): ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావాలంటే డీజే ఎం యు ను గెలిపించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. షాద్నగర్, ఇబ్రహీంపట్నం, హయత్ నగర్ డిపోలలో హనుమంతు ముదిరాజ్ పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్ చేసి మేనిఫెస్టోలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తుందని వచ్చే యూనియన్ ఎన్నికల్లో టి జే యం యు కు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమం వంటి అంశాలపై నిరంతరంగా పోరాటాన్ని కొనసాగించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వివిధ యూనియన్లు పరస్పరం అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నాయని అన్నారు.
News that matters, as it happens
Sunday, 01 November 2026
www.mahinewsindia.com
టీజేఎంయును అధిక మెజార్టీతో గెలిపించండి: - హనుమంతు ముదిరాజ్
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/121