కడప జిల్లా/జమ్మలమడుగు/మైలవరం మండలం, జూలై 19 (మహి న్యూస్): మైలవరం మండలం వేపరాల గ్రామంలో ఆదివారం శ్రీ గంగమ్మ తల్లి చీరెసారె ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
వేపరాల కొత్తకొట్టాల శ్రీ వీరబ్రహ్మం గుడి వద్ద నుంచి భక్తులు తలపై కలశాలు, బిందెలు ధరించి మేళతాళాలు, భజన బృందాల నడుమ ఊరేగింపుగా శ్రీ గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి చీరెసారె సమర్పించారు.
ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పూజా సామగ్రి, స్వీట్లు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ గంగమ్మ తల్లిని భక్తిపూర్వకంగా ప్రార్థించారు.
గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల గోవింద నామస్మరణలు, మేళతాళాల నడుమ గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
News that matters, as it happens
Sunday, 13 September 2026
www.mahinewsindia.com
వేపరాల లో శ్రీ గంగమ్మ తల్లికి ఘనంగా చీరెసారె ఉత్సవం
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/26
0 Comments