Sunday, 13 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING
పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ • కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య • గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ • ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.                     శ్రీకాకుళం జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం • రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి •

నెల్లూరులో యూఐడీఏఐ ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం ప్రజలకు ఒకే చోట అన్ని ఆధార్ సేవలు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి. సంగీత

Share this Article:
నెల్లూరు.మహి న్యూస్ జూలై 20 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలకు ఆధార్ సేవలను మరింత చేరువ చేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రం (ఏఎస్‌కే)ను హైదరాబాదు ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పి. సంగీత, ఐఏఎస్ సోమవారం ప్రారంభించారు. నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్, కేశవుల నగర్, వేదయపాలెం ప్రాంతంలో 25-10-501ఏ భవనం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా జిల్లా ప్రజలకు ఆధార్‌కు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట అందించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పి. సంగీత మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో యూఐడీఏఐ ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ కేంద్రాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తూ, ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఆధార్ నమోదు, వివరాల సవరణ, బయోమెట్రిక్ అప్‌డేట్ వంటి సేవల కోసం ప్రజలు అనవసరంగా పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వంటి వివరాల సవరణ, ఫోటో, వేలిముద్రలు, ఐరిస్ బయోమెట్రిక్ నవీకరణ, డాక్యుమెంట్ అప్‌డేట్, ఆధార్ డౌన్‌లోడ్, ప్రింట్ తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించినట్లు అధికారులు తెలిపారు.నెల్లూరులో ఈ సేవా కేంద్రం ప్రారంభం కావడంతో జిల్లా ప్రజలు ఆధార్ సేవల కోసం ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అన్ని సేవలను వేగంగా పొందే అవకాశం ఏర్పడిందన్నారు. ప్రజలు అపాయింట్‌మెంట్‌తో పాటు నేరుగా వచ్చి కూడా సేవలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో యూఐడీఏఐ అసిస్టెంట్ మేనేజర్ కే. దామోదర్, బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ రీజినల్ మేనేజర్ కె. శ్రీనివాస్ కుమార్, క్లస్టర్ మేనేజర్ దుగ్గి హరినాథ్, ఆపరేషన్స్ మేనేజర్ దిలీప్ కుమార్, యూఐడీఏఐ అధికారులు, బీఎల్ఎస్ ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/29

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X