News that matters, as it happens
Sunday, 13 September 2026
www.mahinewsindia.com
ముస్తాబాద్ బాబా దేవాలయంలో 28, 29 తేదీల్లో గురుపౌర్ణమి వేడుకలు
విజయవాడ,మహి న్యూస్జు లై 26:
కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లో ఉన్న శ్రీ విజయ దుర్గా సమేత శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ సద్గురు సాయినాథ స్వామి వార్ల ఆలయంలో ఈ నెల 28, 29 తేదీల్లో (మంగళవారం, బుధవారం) అత్యంత వైభవోపేతంగా గురుపౌర్ణమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి జి వి ఎస్ పద్మావతి, ట్రస్టీలు సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు, ఎం దుర్గాంజనేయులు తెలిపారు.
మంగళవారం సాయంత్రం ఆరుగంటలకు శ్రీ అభయ ఆంజనేయస్వామి వారికి అభిషేకము మరియు కదళఫలములతో (అరటిపండ్లు) విశేష అర్చన జరుగుతుంది.
గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీ విఘ్నేశ్వర పూజ, ఋత్విక్ వరుణ, ఉదయం 7 గంటలకు మహాన్యాస పారాయణ, సూర్య నమస్కారములు,8 గంటల నుండి శ్రీ విజయ దుర్గ సమేత మల్లికార్జున స్వామి వారి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి 108 కళశాభిషేకం, శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి అభిషేకములు మరియు శ్రీ సద్గురు సాయినాథ స్వామి వారికి 108 కేజీల పుష్పాభిషేకము ఉదయం 10.30 గంటలకు శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతము, సాయంత్రం 5.30 గంటలకు పల్లకీ ఊరేగిపు సేవ, గ్రామోత్సవం జరుగుతాయని చైర్ పర్సన్ పద్మావతి తెలిపారు.
ఉదయం 11 గంటలకు ఆలయ సన్నిధి లో అన్న సమారాధన జరుగుతుందన్నారు.
యాగ్నిక బ్రహ్మ శ్రీకరంమురళీ శర్మ, ఆలయ అర్చకులు ఇటికాల నాగ పవన్ కుమార్ శర్మల ఆధ్వర్యంలో పూజాభిషేక కార్యక్రమాలు జరగనున్నాయని ఈ కార్యక్రమంలో భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని చైర్ పర్సన్ పద్మావతి విజ్ఞప్తి చేశారు.
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/41
0 Comments