కడప, జులై 31: కడప జిల్లా రైతులు వాతావరణ ఆధారిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనల కింద జులై 31 లోపు తమ పంటలకు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గురువారం రాత్రి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా పథకాలను ప్రతి అర్హ రైతు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గడువు ముగిసిన తర్వాత బీమా నమోదు అవకాశం ఉండదని, అందువల్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రీమియం చెల్లించాలని కోరారు.
వాతావరణ ఆధారిత బీమా పథకం కింద అరటి, చిని (బత్తాయి/నిమ్మ), ప్రత్తి, వేరుశనగ పంటలు సాగు చేస్తున్న రైతులు నేడే ప్రీమియం చెల్లించి బీమా నమోదు పూర్తి చేసుకోవాలని తెలిపారు. జులై 31 అర్ధరాత్రి వరకు మాత్రమే గడువు ఉన్నందున రైతులు ఆలస్యం చేయవద్దని స్పష్టం చేశారు.
అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి మినహా ఇతర ప్రధాన పంటలకు బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పసుపు, మినుము, కంది తదితర పంటలు సాగు చేస్తున్న రైతులు కూడా నేడే చివరి అవకాశంగా భావించి బీమా చేయించుకోవాలని సూచించారు.
పంటల బీమా రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టాలను కొంత మేర భర్తీ చేసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News that matters, as it happens
Monday, 14 September 2026
www.mahinewsindia.com
నేడే (జులై 31) పంటల బీమాకు చివరి గడువు...!* * *జిల్లా రైతులు అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/50
0 Comments