నెట్ జీరో అండ్ హెల్దీ క్యాంపస్ ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేయండి - జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
కాకినాడ, మహి న్యూస్, ఆగస్టు 5: నెట్ జీరో అండ్ హెల్దీ క్యాంపస్ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వానికి విద్యుత్ మరియు నిర్వహణ ఖర్చులు తగ్గడంతోపాటు, విద్యార్థులకు అత్యంత ఆరోగ్యకరమైన,పరిశుభ్ర మైన పచ్చని వాతావరణం లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంఘిక,వెనుకబడిన తరగతులు,గిరిజన సంక్షేమ మరియు విద్యాశాఖ అధికారులతో నెట్ జీరో అండ్ హెల్దీ క్యాంపస్ ప్రాజెక్టుపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రాజెక్టు అమలు తీరును సమీక్షించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆశ్రమ, ఉన్నత పాఠశాలల్లో ప్లాంటేషన్ మరియు వేస్ట్ మేనేజ్ మెంట్ పనులను డ్వామా,సంక్షేమ, విద్యా శాఖ అధికారులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. విద్యారంగంలో,ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలలు మరియు హాస్టళ్లలో పర్యా వరణ పరిరక్షణ,స్వయం సమృద్ధిని సాధించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ మని తెలిపారు.
జిల్లాలో నిర్దేశించిన 20 విద్యా సంస్థల్లో అనువైన స్థలాలు ఉన్నచోట వెంటనే ప్లాంటేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.ప్లాంటేషన్,
వేస్ట్ మేనేజ్ మెంట్,సోలార్ ప్యానెల్స్ అమరిక,వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, మరియు వర్షపు నీటి సంరక్షణ(రెయిన్ వాటర్ హార్వెస్టింగ్)వంటి అంశాలపై ప్రత్యేకదృష్టిసారించాలన్నారు. సంప్రదాయ విద్యుత్తు పై ఆధారపడటాన్ని తగ్గించి, విద్యుత్ బిల్లులను సున్నా చేయడానికి నెడ్కాప్ ఆధ్వర్యంలో సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.పాఠశాల ప్రాంగణం లో పచ్చదనాన్ని పెంపొందించడానికి 'వి.బి.జి. రామ్జీ' పథకం ద్వారా మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. వంటగది వ్యర్థాలు మరియు ఇతర చెత్త ను ఉపయోగించి ఆర్గానిక్ కంపోస్టింగ్ ఎరువుల తయారీ ద్వారా వ్యర్థాలను పునర్వినియోగం లోకి తేవాలన్నారు.అలాగే వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంపొందించాల ని పేర్కొన్నారు.
సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మరి యు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలను నెట్ జీరో క్యాంపస్‌లుగా మొదటి దశలో తీర్చిదిద్దాలన్నారు.రెండో దశలోఅన్నిప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ హాస్టళ్లు మరియు ఆశ్రమ పాఠశాలల ను ఈ పరిధిలోకి తీసుకు రావడంజరుగుతుందన్నారు.పాఠశాల విద్యార్థులతో ప్రత్యేక క్లబ్ లను ఏర్పాటు చేసి,మొక్కల పెంపకం,నీటి సంరక్షణ,వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై వారి చేత నే పర్యవేక్షణ చేయించాలని కలెక్టర్ సూచించారు. చిన్నతనంనుంచేవిద్యార్థులకు పర్యావరణంపై బాధ్యత పెంచేలా పాఠశాల విద్యాశాఖ కృషి చేయాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా వ్యాప్తంగా సాంఘి క, బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తు పనులు,విద్యార్థులకు అందుతు న్న వసతులపై సమీక్ష నిర్వహించారు.వసతి గృహాల్లో విద్యార్థుల కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు.ప్రజా సంతృప్తి స్థాయిలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు.ఆహార నాణ్యత,స్టోరేజ్, కిచెన్ పరిశుభ్రత,కాంపౌండ్ పరిశుభ్రతలను పకడ్బందీ గా నిర్వ హించాలన్నారు.విద్యార్థుల ఆరోగ్యపరిరక్షణ పై సమగ్రంగా మానిటరింగ్ చేస్తూ, అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత వైద్యా ధికారుల ద్వారా మెరుగైన వైద్యం అం దించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డ్వామా పీడీ ఎస్. మధుసూదన్, బీసీ సంక్షేమ అధికారి ఏ. శ్రీనివాసరావు, నెట్ జీరో అండ్ హెల్దీ క్యాంపస్ నోడల్ అధికారి వీర బాబు, వసతి గృహ సంక్షేమ అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.